హైదరాబాద్ : తెలంగాణ ఎప్సెట్ (TG EAPCET) షెడ్యూల్ విడుదలైంది. ఈ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 4 చివరి తేదీ. జేఎన్టీయూ ఆధ్వర్యంలో మే 4 నుంచి 11 వరకు ఎప్సెట్ పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణలోని కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ఈ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రతి ఏడాది ఈ పరీక్షలు జరుగుతాయి.