హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలుగు రాని ఉద్యోగుల కోసం తెలుగు అకాడమీ ‘తెలుగు పరిచయ కోర్సు’ను నిర్వహిస్తున్నది. 48 పనిదినాల్లో శిక్షణ ఇస్తున్నట్టు తెలుగు అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ భట్టు రమేశ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 5నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకు క్లాసులుంటాయని వెల్లడించారు. కోర్సులో చేరదల్చిన వారు అక్టోబర్ 4 వరకు తమ వివరాలతో హిమాయత్‌నగర్‌లోని తెలుగు అకాడమీ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 040-23226041, 23225215 నంబర్లలో సంప్రదించాలని కోరారు.