టీయూ ఇంచార్జి రిజిస్ట్రార్ తొలగింపు

- అక్రమ నియామకాలపై ప్రభుత్వం చర్యలు
- నూతన రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ యాదగిరి
నిజామాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో రెండు నెలలుగా దుమా రం రేపుతున్న ఔట్ సోర్సింగ్ అక్రమ నియామకాల అంశానికి తెరపడింది. 113 మంది నియామకాలను రద్దు చేస్తూ వైస్ చాన్స్‌లర్ రవీందర్‌గుప్తా, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సంయుక్తంగా ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్‌లో శనివారం పాలక మండలి సమావేశం జరిగింది. యూనివర్సిటీలో కొద్దిరోజులుగా వివాదాస్పదం అవుతున్న నియామకాల అంశంతోపాటు వీసీ, ఇన్చార్జి రిజిస్ట్రార్ పనితీరుపై చర్చించారు. పాలకమండలి సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి వీసీ, ఇన్చార్జి రిజిస్ట్రార్ తీరుపై మండిపడ్డారు. అక్రమ నియామకాలపైనా నిలదీశారు. యూనివర్సిటీలో అక్రమంగా నియామకమై రోజువారీగా విధులకు హాజరవుతున్న సిబ్బంది వివరాలను, వారి హాజరు పట్టిక గురించి ప్రస్తావించారు. అనంతరం ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కనకయ్యను బాధ్యతల నుంచి తప్పించారు. నూతన రిజిస్ట్రార్‌గా కామర్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ యాదగిరిని నియమించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

