Karate | హైదరాబాద్, ఆట ప్రతినిధి : గత నెల 28 నుంచి డిసెంబర్ 1 దాకా దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా జరిగిన 11వ కామన్వెల్త్ కరాటే చాంపియన్షిప్లో తెలంగాణ కరాటే క్రీడాకారులు పతకాల మోత మోగించారు. ఆడుతున్న తొలి టోర్నీలోనే రాష్ర్టానికి చెందిన రామినేని రోహన్, అమ్రది విశాల్ రెడ్డి, తాళపత్రి ఆరాధ్య పతకాలు గెలిచి చరిత్ర సృష్టించారు. 63 కిలోల విభాగంలో రోహన్ స్వర్ణం గెలవగా 57 కిలోల కేటగిరిలో విశాల్ కాంస్యం నెగ్గాడు. 42 కిలోల విభాగంలో ఆరాధ్య స్వర్ణం గెలిచింది. అంతేగాక ఆమె అండర్-14 విభాగంలోనూ కాంస్యం సొంతం చేసుకుంది.