తలసిరిలో తెలంగాణ దూకుడు
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి బాటలు పరిచింది. దీంతో తొలి పదేండ్లలో రాష్ట్రం తలసరి ఆదాయంలో గణనీయ పురోగతి సాధించింది.
- కేసీఆర్ హయాంలో ఏకంగా 68% పెరుగుదల
- 8 నుంచి రెండో స్థానానికి ఎగబాకిన రాష్ట్రం
- జాతీయ సగటును మించిన ఆర్థిక వృద్ధి
- బీఆర్ఎస్ సర్కార్ సంస్కరణలే కారణం
- సెంటర్ ఫర్ ఎకనమిక్, సోషల్ స్టడీస్ సర్వే వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి బాటలు పరిచింది. దీంతో తొలి పదేండ్లలో రాష్ట్రం తలసరి ఆదాయంలో గణనీయ పురోగతి సాధించింది. 2014-15 నాటికి సాధారణ క్యాటగిరీ రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో ఎనిమిదో స్థానంలో ఉన్న తెలంగాణ.. 2023-24 నాటికి రెండో స్థానానికి ఎగబాకింది. అప్పటికి తెలంగాణ కంటే గోవా రాష్ట్రం మాత్రమే ముందున్నది. నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విస్తరణకు, ప్రజల తలసరి ఆదాయ పెరుగుదలకు దోహదపడ్డాయని తాజాగా సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) విడుదలచేసిన ‘పబ్లిక్ ఫైనాన్సెస్ ఆఫ్ తెలంగాణ, ట్రెండ్స్, చాలెంజెస్ అండ్ పాలసీ ప్రయారిటీస్’ నివేదికలో వెల్లడించింది. 2015-16లో రూ.1,12,267గా ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం.. 2023-24 నాటికి ఏకంగా 68% పెరిగి రూ.1,88,436కు చేరిందని, ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం 48%, ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 63% పెరిగినట్టు పేర్కొన్నది.
219% పెరిగిన రాష్ట్ర జీఎస్డీపీ
స్వరాష్ట్రంగా ఆవిర్భవించాక ఆర్థికంగా తెలంగాణ గణనీయ వృద్ధిని నమోదు చేసిదని, 2014-25 మధ్య కాలంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) ఏకంగా 219% పెరిగి రూ.5,05,484 కోట్ల నుంచి రూ.16,09,902 కోట్లకు చేరినట్టు ‘సెస్’ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో దేశ జీడీపీ 165%, ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ 206% వృద్ధి చెందినట్టు పేర్కొన్నది. 2019-21 మధ్య కొవిడ్ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. అనంతరం రెండు రాష్ట్రాల్లోనూ కోలుకునే పరిస్థితి కనిపించినప్పటికీ కొవిడ్‌కు ముందు నమోదైన వృద్ధి స్థాయిలను అందుకోలేకపోయాయని నివేదిక విశ్లేషించింది.
దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలకం
దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.7 శాతమే అయినప్పటికీ దేశ వాస్తవ స్థూల దేశీయోత్పత్తిలో తెలంగాణ వాటా 4.9% ఉన్నట్టు ‘సెస్’ నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండోలో అనుమతులిచ్చేందుకు టీఎస్ ఐపాస్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ విస్తరణకు చెరువుల పునరుద్ధరణతోపాటు కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులు నిర్మించారు. రైతులకు ఉచితంగా 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తు అందించారు. ఈ సంస్కరణల ఫలితంగా తెలంగాణలో కీలక రంగాలన్నీ ప్రగతి పథంలో పరుగులు తీశాయని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ ప్రాధాన్యత మరింత పెరిగిందని ‘సెస్’ నివేదిక వెల్లడించింది.
కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం
- 2014-15 నాటికి తలసరి ఆదాయంలో తెలంగాణ ర్యాంకు 8
- 2023-24 నాటికి తలసరి ఆదాయంలో తెలంగాణ ర్యాంకు 2
- 2023-24 నాటికి తలసరి ఆదాయంలో తెలంగాణ కంటే ముందున్న ఏకైక రాష్ట్రం గోవా
- 2015-16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,12,267
- 2023-24లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,88,436
- 2015-24 మధ్య కాలంలో తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి 68%
- ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయ వృద్ధి 48%
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

