మెడిసిన్ పీజీలో కిష్టయ్య కూతురు పాస్.. ప్రియాంక మెడికల్ ఫీజు చెల్లించిన కేసీఆర్
తెలంగాణ అమరుడు కానిస్టేబుల్ పుట్టకొక్కుల కిష్టయ్య కూతురు ప్రియాంక మెడిసిన్ పీజీ పూర్తి చేశారు. ప్రియాంక 2023లో కరీంనగర్‌లోని చల్మెడ మెడికల్ కళాశాలలో పీజీలో చేరారు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఆమె ఉత్తీర్ణత సాధించారు.
కరీంనగర్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ అమరుడు కానిస్టేబుల్ పుట్టకొక్కుల కిష్టయ్య కూతురు ప్రియాంక మెడిసిన్ పీజీ పూర్తి చేశారు. ప్రియాంక 2023లో కరీంనగర్‌లోని చల్మెడ మెడికల్ కళాశాలలో పీజీలో చేరారు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో ఆమె ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కిష్టయ్య మరణం అప్పట్లో తెలంగాణ సమాజాన్ని కదిలించింది. ఉద్యమ నేత కేసీఆర్ కిష్టయ్య కుటుంబానికి అండగా నిలిచారు. ఆయన భార్యకు ఉద్యోగం ఇప్పించారు. కొడుకు రాహుల్, కూతురు ప్రియాంకను పూర్తి ఖర్చులు భరించి ఉన్నత విద్యావంతులను చేశారు.
ప్రియాంక ఎంబీబీఎస్ పూర్తి చేసేందుకు అవసరమైన ఖర్చు మొత్తం కేసీఆరే భరించారు. ఆ తర్వాత పీజీ చదువుతానని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా 2023 అక్టోబర్‌లో కరీంనగర్‌లోని చల్మెడ మెడికల్ కళాశాలలో మేనేజ్మెంట్ కోటా కింద సీటు ఇప్పించారు. ఇందుకు అయ్యే ఫీజు మొత్తం రూ.24 లక్షలు చెల్లించారు. పట్టుదలగా చదివిన ప్రియాంక పీజీలో జనరల్సర్జన్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబాన్ని కలిసి కృతజ్ఞతలు చెబుతామని కిష్టయ్య భార్య పద్మావతి తెలిపారు. ఆయన కారణంగానే తన కూతురు ఎంబీబీఎస్, పీజీ పూర్తి చేయగలిగిందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

