ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ
ప్రపంచమంతా దేవుండ్లను పూలతో కొలిస్తే.. ఆ పూలనే దేవతగా కొలుస్తూ ప్రకృతిని ఆరాధించే అద్భుతమైన పండుగ మన బతుకమ్మ అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు.
- దేశంలోని అన్ని పండుగల్లో ప్రత్యేకం
- రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : ప్రపంచమంతా దేవుండ్లను పూలతో కొలిస్తే.. ఆ పూలనే దేవతగా కొలుస్తూ ప్రకృతిని ఆరాధించే అద్భుతమైన పండుగ మన బతుకమ్మ అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. దేశంలోని అన్ని సంప్రదాయ పండుగల్లో బతుకమ్మ ప్రత్యేకమని, తెలంగాణ జీవన విధానం, సంస్కృతికి దర్పణంగా నిలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవితంలో భాగమైందని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంసృతిక వైభవం, తెలంగాణ రాష్ట్ర పండుగ, బతుకమ్మ ఉత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలిపూల బతుమ్మగా ప్రారంభమై, సద్దుల బతుకమ్మతో ముగిసే తొమ్మిది రోజుల పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సందడి నెలకొంటుందని వెల్లడించారు. పిల్లాపాపలతో ఒకచోట కూడి, ఆటాపాటలతో, ఆడబిడ్డలు బతుకమ్మను కొలిచి మొకుతారని పేర్కొన్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వం బతుకమ్మకు రాష్ట్ర పండుగ హోదానివ్వడమే కాకుండా, ఆడబిడ్డలకు కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేసే సంప్రదాయాన్ని అమలు చేసిందని గుర్తుచేశారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారి సంక్షేమానికి పలు రకాల పటిష్ట కార్యక్రమాలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

