హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాసనమండలి ఎన్నికలకు నగారా మోగింది. ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌తోపాటు, స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదలచేసింది. దీంతో ఉమ్మడి హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇది ఎన్నికల ప్రక్రియ ముగిసే డిసెంబర్ 16 వరకు అమల్లో ఉంటుంది.
రాష్ట్ర శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు నవంబర్ 29న పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపడతారు. స్థానిక సంస్థల
కోటాలోని 12 స్థానాలకు పోలింగ్‌ను డిసెంబర్ 10న, కౌంటింగ్‌ను డిసెంబర్ 14న నిర్వహిస్తారు. ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు మంగళవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా, తొలిరోజు ఒక్కటి కూడా దాఖలు కాలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని 11 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఇప్పటికే ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 29న పోలింగ్ నిర్వహించనున్న ఈ స్థానాలకు నామిషనేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 16 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22 వరకు అవకాశం కల్పించారు.
ఈ నెల 29న పోలింగ్ నిర్వహించి, అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎమ్మెల్యే కోటాలో మండలికి ప్రా తినిథ్యం వహించిన ఆకుల లలి త, మహమ్మద్ ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడి యం శ్రీహరి పదవీకాలం ఈ ఏడాది జూన్ 3న ముగిసింది. కాలపరిమితిలోపే జరుగాల్సిన ఎ న్నికలను కరోనా వ్యాప్తి నేపథ్యం లో ఎన్నికల సంఘం వాయిదా వేసింది. అక్టోబర్ 31న షెడ్యూ ల్ విడుదల చేసింది.
స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించను న్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 1, వరంగల్ 1, నల్లగొండ 1, మెదక్ 1, నిజామాబాద్ 1, ఖమ్మం 1, కరీంనగర్ 2, మహబూబ్‌నగర్ 2, రంగారెడ్డి జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ 12 స్థానాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీల పదవీకాలం 2022 జనవరి 4తో ముగియనున్నది. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్‌ను ఈ నెల 16 విడుదల చేసి, అదే రోజు నుంచి 23 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 వరకు అవకాశమిస్తారు. డిసెంబర్ 10న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్. ఓట్ల లెక్కింపును డిసెంబర్ 14న నిర్వహిస్తారు. ఈ ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 16తో ముగుస్తుందని ఎన్నికల సంఘం పేర్కొంది. జనవరి 4తో పదవీకాలం ముగిసే ఎమ్మెల్సీల్లో పు రాణం సతీశ్‌కుమార్ (ఆదిలాబాద్), పోచంపల్లి శ్రీ నివాస్‌రెడ్డి (వరంగల్), తేర చిన్నపరెడ్డి (నల్లగొం డ), వీ భూపాల్‌రెడ్డి (మెదక్), కల్వకుంట్ల కవిత (నిజామాబాద్), బాలసాని లక్ష్మీనారాయణ (ఖ మ్మం), టీ భానుప్రసాద్‌రావు, నారదాసు లక్ష్మణ్‌రావు (కరీంనగర్), కసిరెడ్డి నారాయణరెడ్డి, కే దా మోదర్‌రెడ్డి (మహబూబ్‌నగర్), పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌రాజు (రంగారెడ్డి) ఉన్నారు.
2018 తర్వాత స్థానిక సంస్థల కోటాలోని నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఉన్న భూపతిరెడ్డిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు ప డటం, వరంగల్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కొండా మురళి పార్టీ మారిన కారణంగా అనర్హత వేటు పడే సమయంలో రాజీనామా చేయడంతో ఆ రెండు స్థానాలు ఖాళీ అయ్యా యి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ ఎమ్మెల్సీగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రంగారెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న పట్నం నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో ఆ స్థానాలు ఖాళీ అ య్యాయి. ఆయా స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల కవి త, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తేర చిన్నపరెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు.
స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో మంగళవారం నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ప్రకటించారు. షెడ్యూల్ విడుదల అనంతరం గోయల్ మీ డియాతో మాట్లాడుతూ.. కోడ్ అమల్లో ఉన్న జిల్లా ల్లో రాజకీయ పా ర్టీల నాయకులు పాదయాత్రలు, రోడ్‌షోలు నిర్వహించకూడదని చెప్పారు. రాజకీయ సభలు, సమావేశాలకు అనుమతి లేదని, ఒకవేళ నిర్వహించినా 500 మందికి మించకూడదని తెలిపారు.
ఆయా జిల్లాల్లో రాజకీయ పార్టీలు, సం ఘాలు నిరసన కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహించాలన్నా కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నామినేషన్ కార్యక్రమాల్లో ర్యాలీలకు అనుమతి లేదని ఆయన చెప్పారు. ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారానే నిర్వహిస్తామని వెల్లడించారు. రాజకీయ నేతలు, ఓటర్లు అందరూ కొవిడ్ నిబంధనలు, ఎన్నికల నిబంధనలు పాటించాలని కోరారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకోవాలని స్పష్టంచేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థల కోటాలో శాసనమండలిలోని 11 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్క స్థానానికి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్టణం జిల్లాల్లో రెండేసి స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహిస్తారు.
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): శాసనమండలి ఎన్నికల కోడ్ నేపథ్యం లో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం తలపెట్టిన వరంగల్ పర్యటన వాయిదా పడింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సీఎం కేసీఆర్ వరంగల్, హనుమకొండ జిల్లాలకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించాల్సి ఉన్నది.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ నెల 29న టీఆర్ఎస్ తలపెట్టిన తెలంగాణ విజయగర్జన బహిరంగ సభ వాయిదాపడే అవకాశం కనిపిస్తున్నది. ఎమ్మెల్యే కోటాలో ఆరు, స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో డిసెంబర్ 16 వరకు ఎన్నికల కో డ్ అమలులో ఉంటుంది. రాజకీయపార్టీలు, సంఘాలు 500 మించిన జనాభాతో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.
మునుపెన్నడూ లేనివిధంగా ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ఈ నిబంధనలు వరంగల్‌లో పది లక్షల మందితో నిర్వహించ తలపెట్టిన విజయగర్జన సభకు అవరోధంగా మారనున్నాయి. విజయగర్జన సభ నిర్వహణపై టీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది.