‘ల్యాంకో’కు బకాయిలపై 28 వరకు స్టే
ఏపీలోని ల్యాంకో కొండపల్లి పవర్ లిమిటెడ్ గతంలో సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించిన బకాయిల చెల్లింపుపై ఈ నెల 28 వరకు స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. బకాయిల వివాదంపై తెలంగాణ డిసమ్లు దాఖలు చేసిన అప్పీల్పై ఈ నెల 28న ఎలక్ట్రిసిటీ అప్పీలెట్ ట్రిబ్యునల్ విచారణ జరుపనున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ఏపీలోని ల్యాంకో కొండపల్లి పవర్ లిమిటెడ్ గతంలో సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించిన బకాయిల చెల్లింపుపై ఈ నెల 28 వరకు స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. బకాయిల వివాదంపై తెలంగాణ డిసమ్లు దాఖలు చేసిన అప్పీల్పై ఈ నెల 28న ఎలక్ట్రిసిటీ అప్పీలెట్ ట్రిబ్యునల్ విచారణ జరుపనున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2023లో కేంద్ర ప్రభుత్వం సవరించిన ఎస్వోపీని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని, దాని ఆధారంగా ‘ప్రాప్తి’ పోర్టల్లో ల్యాంకో పెట్టిన ఇన్వాయిస్లను తొలగించాలని కోరుతూ హైకోర్టులో టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై జస్టిస్ ఈవీ వేణుగోపాల్ బుధవారం విచారణ చేపట్టారు. ‘ప్రాప్తి’ పోర్టల్లోని ఇన్వాయిస్ల అమలును ఈ నెల 28 వరకు నిలిపివేస్తూ జస్టిస్ వేణుగోపాల్ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

