కబ్జా చెర విడిపించారు..

బంజారాహిల్స్, డిసెంబర్ 23: నగరం నడిబొడ్డున రూ.220 కోట్ల విలువైన ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు చేసిన ప్రయత్నాలను రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. షేక్‌పేట మండల పరిధిలోని సర్వే నంబర్ 403/పీలో టీఎస్ నంబర్ 1లోని బ్లాక్ హెచ్, వార్డు 10లో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. పార్థసారధి అనే వ్యక్తి రెండున్నర ఎకరాల స్థలాన్ని ఆక్రమించేందుకు ఫెన్సింగ్ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఓ గదిని కట్టుకుని ఇంటి నంబర్‌ను కూడా రాశాడు. సదరు స్థలాన్ని రాఘవరావు అనే వ్యక్తి నుంచి తాము కొనుగోలు చేశామని చెబుతూ.. టీఎస్ఎల్ఆర్ రికార్డుల్లో ఫోర్జరీ పత్రాలను తయారు చేశాడు.
ఈ స్థలాన్ని సత్తిరెడ్డి అనే వ్యక్తికి అమ్మకానికి పెట్టాడు. అయితే రెవెన్యూ అధికారుల వద్ద వివరాలు తీసుకున్న తర్వాత అడ్వాన్స్ ఇస్తానని చెప్పిన సత్తిరెడ్డి.. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాడు. దీంతో ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని కలెక్టర్ ఆదేశాలతో తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి రికార్డులను పరిశీలించగా, సదరు స్థలం ప్రభుత్వభూమి అని, మొత్తం రెవెన్యూశాఖ ఆధీనంలో ఉందని తేలింది. దీంతో రెవెన్యూ సిబ్బంది అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చేశారు. కృష్ణా గ్రూపు పార్థసారథి అనే వ్యక్తితో పాటు మరికొంతమంది కలిసి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ.. షేక్‌పేట మండల డిప్యూటీ తాసీల్దార్ (ల్యాండ్ ప్రొటెక్షన్) సందీప్ గురువారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

