సర్కార్ పాపం
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యానికి యువ రైతు ప్రాణం బలైంది. అధికారులకు సహకరించేందుకు ట్రాన్స్ఫార్మర్పైకి చేరి తీగలు సరిచేస్తుండగా షాక్ కొట్టడంతో తీగలపైనే ఒరిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఆగ్రహం చెందిన స్థానికులు సబ్స్టేషన్ ఆపరేటర్పై దాడికి దిగారు. టేక్మాల్ మండలం షాబాద్ గ్రామపంచాయతీ పరిధిలోని దండువానికుంట శివారులో వ్యవసాయ బోరు మోటర్లకు విద్యుత్తు సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ను ఇటీవల ఒకచోట నుంచి మరోచోటుకు మార్చారు.
- తీగల మీదే ఒరిగిన యువ రైతు
టేక్మాల్, అక్టోబర్ 14 : విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యానికి యువ రైతు ప్రాణం బలైంది. అధికారులకు సహకరించేందుకు ట్రాన్స్ఫార్మర్పైకి చేరి తీగలు సరిచేస్తుండగా షాక్ కొట్టడంతో తీగలపైనే ఒరిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఆగ్రహం చెందిన స్థానికులు సబ్స్టేషన్ ఆపరేటర్పై దాడికి దిగారు. టేక్మాల్ మండలం షాబాద్ గ్రామపంచాయతీ పరిధిలోని దండువానికుంట శివారులో వ్యవసాయ బోరు మోటర్లకు విద్యుత్తు సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ను ఇటీవల ఒకచోట నుంచి మరోచోటుకు మార్చారు. బుధవారం ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేయడానికి విద్యుత్తు అధికారులకు సహకరించేందుకు తండాకు చెందిన యువ రైతు విస్లావత్ అనిల్ (27) ముందుకు వచ్చాడు.
మరమ్మతులు చేసే ముందు సంబంధిత లైన్మెన్ హరికుమార్ ఎల్సీ తీసుకోలేదు. నిచ్చెన సహాయంతో అనిల్ పైకి ఎక్కి మరమ్మతులు చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్తు సరఫరా కావడంతో షాక్ తగిలి తీగలపైనే ప్రాణాలు వదిలాడు. లైన్మెన్ గాయాలతో కిందపడిపోయాడు. మృతుడు అనిల్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే అనిల్ మృతి చెందాడని తండావాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల తీరును నిరసిస్తూ ఘటనా స్థలంలోనే ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. సబ్స్టేషన్ ఆపరేటప్పై దాడి చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
రైతుకు శాపం
- పొలంలోనే ఉరేసుకుని..
దుమ్ముగూడెం/శివ్వంపేట, అక్టోబర్ 14 : నీరందక పంటలు ఎండిపోతుండటంతో మనోవేదనకు గురై ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటనలు భద్రాద్రి, మెదక్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామానికి చెందిన కుమ్మరికుంట్ల ముత్యాలరావు(52) తనకున్న రెండు ఎకరాలపాటు ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఇటీవల వచ్చిన గోదావరి వరదలతో ఒడ్డునే మూడు ఎకరాల్లో వేసిన మిర్చి పంట పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో మానసిక వేదనకు గురైన ముత్యాలరావు.. తోటను తొలగించి మళ్లీ మిర్చి పంట వేసేందుకు దుక్కి దున్నాడు. మరోపక్క వరి పొలానికి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీరు అందడం లేదు.
ఈ క్రమంలో మూడు రోజులుగా తీవ్ర ఆందోళనకు గురైన ముత్యాలరావు బుధవారం తెల్లవారుజామున తన పొలం వద్దే చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోవైపు మెదక్ జిల్లా శివ్వంపేట మండలం భీమ్లాతండా పంచాయతీ శంకర్తండాకు చెందిన మాలోత్ శంకర్ (48) తనకున్న రెండున్నర ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండు బోరు మోటర్లు చెడిపోయాయి. ఒక బోరుమోటర్ను నాలుగు రోజుల క్రితం మరమ్మతు చేస్తుండగా మోటర్ చివరిభాగం ఒక్కసారిగా బోరుబావిలో పడిపోయింది. దీంతో పంటకు నీరందక పొలం ఎండిపోతుండటంతో శంకర్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. మంగళవారం రాత్రి పొలం వద్దే ఉన్న శంకర్ ఇంటికి తిరిగి రాలేదు. బుధవారం పొలానికి వెళ్లిన కుటుంబ సభ్యులకు చెట్టుకు ఉరివేసుకుని విగత జీవిగా వేలాడుతూ కన్పించాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

