3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: కోమటిరెడ్డి
తెలంగాణ రైజింగ్2047 విజన్‌లో భాగంగా 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో రహదారులశాఖ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు. బుధవారం హైటెక్స్‌లో 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ నిర్వహణకు ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
హైదరాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): తెలంగాణ రైజింగ్2047 విజన్‌లో భాగంగా 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో రహదారులశాఖ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు. బుధవారం హైటెక్స్‌లో 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ నిర్వహణకు ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రహదారుల అభివృద్ధి వల్లే 202526లో రాష్ట్ర జీడీపీ 17.82 లక్షల కోట్లకు చేరిందని గుర్తుచేశారు. గురువారం కేంద్రమంత్రి నితిన్ గడరీ ఈ సదస్సును ప్రారంభిస్తారని, అనంతరం సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి రాష్ట్రంలోని ప్రధాన రహదారి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. 3,500 మంది నిపుణులు, 400 ఎగ్జిబిషన్ స్టాళ్లతో జరిగే ఈ సదస్సు ద్వారా ఆధునిక టెక్నాలజీ, పెట్టుబడుల భాగస్వామ్యాలు రాష్ట్రానికి అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు.
పాదచారులకు సురక్షితమైన రోడ్లపై పూర్తి హకు
రహదారుల అభివృద్ధిని కేవలం నిర్మించిన కిలోమీటర్ల సంఖ్య, భారీ ఫ్లైఓవర్ల పరిమాణంతోనో కొలవకూడదని, సామాన్య వ్యక్తి ఆ రోడ్డును సురక్షితంగా ఉపయోగించగలడా లేదా అన్నదే ముఖ్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు. హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేలపై రూ. వేల కోట్ల ఖర్చు చేస్తున్నట్టే పాదచారుల భద్రతకు, నడిచే హకు(రైట్ టు వాక్)కు అంతే ప్రాధాన్యత ఇవ్వాలని పేరొన్నారు. సదస్సులో తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆవిషరించనున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

