భూముల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
మియాపూర్‌లోని సర్వే నంబర్ 100, 101 పరిధిలో ఉన్న 550 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు తెలిపారు. బుధవారం మియాపూర్‌లోని ఎంఏ నగర్, ప్రశాంత్‌నగర్, స్టాలిన్నగర్, దీప్తిశ్రీనగర్ కాలనీల్లో పర్యటించిన ఆయన స్థానికులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
- మియాపూర్ భూముల పరిరక్షణకు లక్ష సంతకాల సేకరణ: రాంచందర్‌రావు
హైదరాబాద్: మియాపూర్‌లోని సర్వే నంబర్ 100, 101 పరిధిలో ఉన్న 550 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు తెలిపారు. బుధవారం మియాపూర్‌లోని ఎంఏ నగర్, ప్రశాంత్‌నగర్, స్టాలిన్నగర్, దీప్తిశ్రీనగర్ కాలనీల్లో పర్యటించిన ఆయన స్థానికులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ 550 ఎకరాల్లో అన్ని అనుమతులు తీసుకుని ఇండ్లు కట్టుకుని దాదాపు 15 వేల కుటుంబాలు ఉంటున్నాయని అన్నారు. ఆ 150 ఎకరాల భూమి, ఇండ్లు ఆయా కుటుంబాలకే చెందాలని, ప్రభుత్వం వాటి జోలికి వెళ్లకూడదని డిమాండ్ చేశారు. మిగిలిన 400 ఎకరాలను పారులు, ప్లే గ్రౌండ్స్, దవాఖానలు వంటి ప్రజా ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలని సూచించారు. భూముల వేలం నిర్ణయాన్ని నిరసిస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

