‘వారణాసి’ రిలీజ్ డేట్ మారనుందా?
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘వారణాసి’ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘వారణాసి’ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ మారే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వచ్చే ఏడాది జూలై 30న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసింది.
దర్శకుడు రాజమౌళి తన ప్రతి సినిమాను విజువల్‌గా కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. సినిమా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమాను తీర్చిదిద్దుతారు. ‘వారణాసి’ విషయంలో ఆయన మరింతగా శ్రద్ధ తీసుకుంటున్నారని, అందుకే రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ టాక్. అయితే ఈ విషయంలో వాస్తవమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

