హైదరాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ) : వినాయక విగ్రహాల నిమజ్జనాల నేపథ్యంలో ఈ నెల 25న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం సీఎస్ సంజయ్ జాజు ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు మాత్రమే ఈ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు.
25న సెలవుకు బదులుగా నవంబర్ 14న వచ్చే రెండో శనివారం వర్కింగ్ డేగా ప్రకటించారు.