సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. 50 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. సింగపూర్‌లోని బ్లడ్‌బ్యాంక్ @ వన్ పుంగోల్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శిబిరాన్ని నిర్వహించారు.
సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. సింగపూర్‌లోని బ్లడ్‌బ్యాంక్ @ వన్ పుంగోల్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.
అవసరమైన వారికి రక్తాన్ని అందించాలనే లక్ష్యంతో తెలంగాణ కల్చరల్ సొసైటీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రక్తదానానికి అర్హులైన పలువురు ముందుకొచ్చి శిబిరంలో పాల్గొన్నారు. రక్తదానం చేయడం ద్వారా సమాజానికి సేవ చేసే అవకాశం లభించిందని పలువురు దాతలు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను సొసైటీ నిరంతరం కొనసాగించాలని, మరింతమంది రక్తదానానికి ముందుకు రావాలని ఆకాంక్షించారు.
శిబిరం విజయవంతం కావడానికి కృషి చేసిన నిర్వాహకులు, వాలంటీర్లకు రక్తదాతలు అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన సింగపూర్ హెల్త్ సైన్సెస్ అథారిటీ (HSA) సిబ్బందికి సొసైటీ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Singapore12
ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, విక్రమ్ చిట్ల, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు, శివ ప్రసాద్ ఆవుల, కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా కృష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్, యసరావేణి విజయ కుమార్, మల్లారెడ్డి కల్లెం, సుకేందర్ నీలం తదితరులు రక్తదాతలకు, వాలంటీర్లకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. 50 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం
Jailer 2 | రూ.800 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. కోలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన రజనీకాంత్!
Road accident | కరీనంగర్ జిల్లాలో విషాదం.. కారు ఢీ కొని యువకుడి మృతి
Health tips | లేవగానే బ్రష్ చేయకుండానే నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Regina | ప్రేమలో దారుణంగా మోసపోయా,డిప్రెషన్లోకి వెళ్లా.. జీవితంలోని చేదు అనుభవాన్ని బయటపెట్టిన రెజీనా!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

