Health tips | లేవగానే బ్రష్ చేయకుండానే నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Health tips | సాధారణంగా చాలామందికి ఉదయం లేవగానే నీళ్లు తాగడం అలవాటు. ఉదయాన్నే నీళ్లు తాగే అలవాటు మంచిది కూడా. అయితే కొంతమంది బ్రష్ చేసి నీళ్లు తాగితే.. కొంతమంది మాత్రం బ్రష్ చేయకుండానే తాగుతారు. అయితే ఇలా బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Health tips : సాధారణంగా చాలామందికి ఉదయం లేవగానే నీళ్లు తాగడం అలవాటు. ఉదయాన్నే నీళ్లు తాగే అలవాటు మంచిది కూడా. అయితే కొంతమంది బ్రష్ చేసి నీళ్లు తాగితే.. కొంతమంది మాత్రం బ్రష్ చేయకుండానే తాగుతారు. అయితే ఇలా బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నోటిని శుభ్రం చేసుకోకుండా నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆ అనారోగ్య సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా రాత్రికి పడుకుని ఉదయం లేచేసరికి నోటి నిండా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. పళ్లపై, నాలుకపై సూక్ష్మ క్రిములు పేరుకుపోతాయి. కాబట్టి లేవగానే నోరు శుభ్రం చేసుకోకుండా నీళ్లు తాగితే.. నీళ్లతోపాటు క్రిములు కూడా శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల అనేక వ్యాధులు వస్తాయి. పళ్లు కూడా దెబ్బతింటాయి. అయితే పల్లు తోముకుని పరగడుపున నీటిని తాగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
పరగడుపున ఒక గ్లాస్ లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగడంవల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, దానివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేవగానే బ్రష్ చేసుకుని నీళ్లు తాగడంవల్ల శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో ఉన్న టాక్సిన్స్, మలిన పదార్థాలు బయటకు పోతాయి. మల బద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవు.
శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే చర్మ సమస్యలు పోయి ఆరోగ్యంగా ఉంటుంది. చర్మానికి సహజంగానే మెరుపు వస్తుంది. గోరువెచ్చని నీళ్లు తాగితే జీర్ణాశయం కూడా శుభ్రమవుతుందని నిపుణులు అంటున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | లేవగానే బ్రష్ చేయకుండానే నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Regina | ప్రేమలో దారుణంగా మోసపోయా,డిప్రెషన్లోకి వెళ్లా.. జీవితంలోని చేదు అనుభవాన్ని బయటపెట్టిన రెజీనా!
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

