Regina | ప్రేమలో దారుణంగా మోసపోయా,డిప్రెషన్లోకి వెళ్లా.. జీవితంలోని చేదు అనుభవాన్ని బయటపెట్టిన రెజీనా!
Regina | గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా, విభిన్నమైన కథలు, పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రెజీనా కసాండ్రా. కథానాయికగా మాత్రమే కాకుండా ప్రతినాయిక ఛాయలున్న పాత్రల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మూకుత్తి అమ్మన్ 2’ సినిమాలో కీలకమైన ప్రతికూల ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారు.
Regina | గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా, విభిన్నమైన కథలు, పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రెజీనా కసాండ్రా. కథానాయికగా మాత్రమే కాకుండా ప్రతినాయిక ఛాయలున్న పాత్రల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మూకుత్తి అమ్మన్ 2’ సినిమాలో కీలకమైన ప్రతికూల ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారు. తెలుగులో ఈ చిత్రం ‘మహాశక్తి’ పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న రెజీనా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో ప్రేమలో ఎదురైన చేదు అనుభవం తనను ఎంతగా కుంగదీసిందో వివరించారు.
తన గత ప్రేమ బంధం గురించి మాట్లాడుతూ.. 2020లో తన జీవితంలో ఊహించని సంఘటన చోటుచేసుకుందని రెజీనా వెల్లడించారు. ప్రేమ బంధం అర్థాంతరంగా ముగియడంతో పాటు, ఆ సంబంధంలో తాను తీవ్రంగా మోసపోయానని చెప్పారు. ఆ పరిణామం తనపై తీవ్ర మానసిక ప్రభావం చూపిందని, కొంతకాలం డిప్రెషన్‌తో బాధపడ్డానని తెలిపారు. ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని, ఆ అనుభవం తర్వాత కొంతకాలం ఎలాంటి కొత్త ప్రేమ బంధంలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని రెజీనా పేర్కొన్నారు. ఆ సమయంలో ఎదురైన మానసిక సంఘర్షణ తన జీవితాన్ని మరో కోణంలో ఆలోచించేలా చేసిందని వివరించారు.
కష్టకాలం నుంచి బయటపడటానికి తనకు తానే సమయం కేటాయించుకోవడం ఎంతో ఉపయోగపడిందని రెజీనా చెప్పారు. ఇతరుల నుంచి ప్రేమ, ఆదరణ, ఓదార్పు ఆశించే ముందు మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకోవాలని సూచించారు. ప్రేమలో ఎదురైన వైఫల్యాలే కాకుండా, చాలామంది యువతులు జీవితంలో ఏదో ఒక దశలో లైంగిక వేధింపులు, ఇతర చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. తన స్నేహితులతో మాట్లాడినప్పుడు ఇలాంటి సమస్యలు ఎంత విస్తృతంగా ఉన్నాయో అర్థమైందని తెలిపారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు బాధితులు తమనే తాము నిందించుకోవద్దని రెజీనా సూచించారు. ‘నాకే ఎందుకు ఇలా జరిగింది?’ అని ఆత్మన్యూనతకు గురికాకుండా, జరిగిన విషయాలను మనసులో దాచుకోకుండా నమ్మకమైన వారితో పంచుకోవాలని చెప్పారు. ధైర్యంగా తమ బాధను బయటపెట్టినప్పుడే ఆ చేదు అనుభవాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Regina | ప్రేమలో దారుణంగా మోసపోయా,డిప్రెషన్లోకి వెళ్లా.. జీవితంలోని చేదు అనుభవాన్ని బయటపెట్టిన రెజీనా!
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
Aadarsha Kutumbam | మూడు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ జోరు!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

