2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు 2029 సంవత్సరంలోనే జరుగుతాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కుదిరితే ఐదు నెలలు రాష్ట్రపతి పాలన విధించవచ్చని పేర్కొన్నారు.
- కుదిరితే ఐదు నెలలు రాష్ట్రపతి పాలన
- బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు 2029 సంవత్సరంలోనే జరుగుతాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కుదిరితే ఐదు నెలలు రాష్ట్రపతి పాలన విధించవచ్చని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్‌లో ఈ కీలకాంశాలను వెల్లడించారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు 2028 డిసెంబర్ వరకే ఉన్నదని, కానీ ఎన్నికల సమయం పొడిగిస్తే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి కొనసాగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఆర్టికల్ 352 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చని తెలిపారు. డీలిమిటేషన్ అనేది సాధారణంగా ప్రతి పదేండ్లకు ఒకసారి జరుగుతుందని, సీట్లు పెరిగితే ఆ మేరకు ఎస్సీ, ఎస్టీల సీట్లు పెరుగవా? అని ప్రశ్నించారు. డిసెంబర్ వరకు డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదించకపోతే జనాభా మేరకు సీట్ల పెంపు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

