 
                                                            Tejaswini | నందమూరి కుటుంబం నుండి మరో వ్యక్తి ఎంటర్టైన్మెంట్ రంగంలో అడుగు పెట్టారు. నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. ఇప్పటివరకు తండ్రి ప్రాజెక్టులు, నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం అవుతూ వచ్చిన తేజస్విని, ఇప్పుడు తనదైన శైలిలో తెరపై కనిపించి సందడి చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్‌కు తేజస్విని బ్రాండ్ అంబాసడర్‌గా ఎంపికయ్యారు. ఈ కమర్షియల్ షూట్ ఇటీవల పూర్తి కాగా, తాజాగా వీడియో బయటకు వచ్చేసింది. ఇది తేజస్విని కెరీర్‌కు ఆరంభం కావడమే కాకుండా, నందమూరి వారసురాలిగా ఆమెకి కొత్త గుర్తింపుని తెచ్చిపెట్టేలా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ లగ్జరీ జ్యువెలరీ సంస్థగా గుర్తింపు పొందిన సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ తమ కొత్త బ్రాండ్ అంబాసడర్‌గా నందమూరి తేజస్విని ను ప్రకటించింది. ఈ ప్రకటనతో నందమూరి అభిమానులు, ఫ్యాషన్ ప్రియులలో భారీ ఆసక్తి నెలకొంది. తేజస్విని, తెలుగు సినీ రంగానికి పునాది వేసిన నందమూరి తారక రామారావు మనుమరాలు, నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె. ఈ యాడ్ క్యాంపెయిన్‌తో ఆమె మొదటిసారిగా కెమెరా ముందు కనిపించి సందడి చేసింది. ఆమె వ్యక్తిత్వం, శాంతమైన అటిట్యూడ్ ఈ బ్రాండ్‌కు కొత్త ఆకర్షణగా నిలుస్తోంది.
తేజస్విని, విశాఖపట్నం ఎంపీ , విద్యావేత్త మాథుకుమల్లి భారత్ భార్య. ఆమెలో ఉన్న సొగసు, సంప్రదాయానికి కలిసిన ఆధునికత ఈ బ్రాండ్ ఇమేజ్‌కి ప్రత్యేకమైన మెరుపు తీసుకొస్తోంది. ఈ ప్రమోషనల్ ఫిల్మ్‌కి దర్శకుడు వై. యమున కిషోర్ దర్శకత్వం వహించారు. బృంద మాస్టర్ కొరియోగ్రఫీతో విజువల్స్ మరింత అట్రాక్టివ్‌గా మారాయి. ఎస్.ఎస్. థమన్ సంగీతం బోనస్ కాగా , ఐయాంకా బోస్ ఛాయాగ్రహణం తేజస్విని అందాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ సంస్థను నాగిని ప్రసాద్ వేమూరి, శ్రీమణి మాథుకుమల్లి, శ్రీదుర్గా కత్రగడ్డ అనే ముగ్గురు ప్రతిభావంతమైన మహిళలు నడుపుతున్నారు. ఈ భాగస్వామ్యంతో బ్రాండ్ వారసత్వం, కళ, సౌందర్యం, శాశ్వతమైన ఎలిగెన్స్ అనే విలువలను ప్రతిబింబిస్తోంది.
 
                            