Teja Sajja | అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రముఖ ఇంటర్నేషనల్ రియాలిటీ గేమ్ షో ‘ది ట్రైటర్స్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా టాలెంటెడ్ యంగ్ హీరో తేజ సజ్జ రియాలిటీ షో హోస్ట్‌గా అరంగేట్రం చేస్తున్నారు. ఈ మేరకు ప్రైమ్ వీడియో సంస్థ అధికారిక ప్రకటనతో పాటు ఒక ఆసక్తికరమైన ప్రోమోను కూడా విడుదల చేసింది.
ఈ హై-వోల్టేజ్ గేమ్ షో పూర్తిగా మోసాలు, వ్యూహాలు, రహస్య కూటములు మరియు ఊహించని మలుపుల ఆధారంగా సాగుతుంది. ఇందులో కొందరు కంటెస్టెంట్స్ ఇన్నోసెంట్స్గా ఉంటే, మరికొందరు ట్రైటర్స్గా వ్యవహరిస్తారు. ట్రైటర్స్ ఎవరనేది కనిపెట్టడానికి ఇన్నోసెంట్స్ చేసే ప్రయత్నాలు, మధ్యలో జరిగే ఉత్కంఠభరితమైన డ్రామా ప్రేక్షకులను ఎంతగానో అలరించనుంది. ఈ షో అక్టోబర్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది.