ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్ జంటగా నటిస్తున్న సినిమా ‘తీస్ మార్ ఖాన్’. సునీల్, పూర్ణ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజన్ సినిమాస్ పతాకంపై నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్లో ‘మనం ఆపాలనుకున్నా, ఆపలేనంత పవర్ వాడి దగ్గరుంది..’ వంటి డైలాగ్స్ హీరోయిజంను చూపించాయి.
ఈ సందర్భంగా దర్శకుడు కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ..‘ఈ చిత్రంలో స్టూడెంట్, పోలీస్, రౌడీ..ఇలా మూడు ఛాయలున్న పాత్రలో ఆది సాయికుమార్ నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నాం. ఇప్పటిదాకా విడుదల చేసిన గ్లింప్స్, ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది. త్వరలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’ అన్నారు. అనూప్‌సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్, అర్జున్ అంబటి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : మణికాంత్, సంగీతం : సాయి కార్తీక్.