పాతికేండ్లయినా ప్రమోషన్ నిల్.. అత్యంత దయనీయ స్థితిలో ఎస్జీటీలు
రాష్ట్రంలోని సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)లు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారు. మారుమూల గ్రామాలు, తండాల్లో విధులు నిర్వర్తించి వేలమంది విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఎస్జీటీల హోదాలో ఎలాంటి ఎదుగుదల లేదు.
- వేతన ప్రయోజనాల్లోనూ అన్యాయమే
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): పాతికేండ్ల సర్వీసు పూర్తిచేసినా ఉద్యోగోన్నతి మాత్రం ‘అందని ద్రాక్ష’గానే మిగిలిపోయింది. వారి వేతన ప్రయోజనాల్లోనూ ఆశించిన పురోగతి లేదు. ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు 5-15 ఏండ్లలోనే ప్రమోషన్లు లభిస్తుంటే విద్యాశాఖలో మాత్రం రెండున్నర దశాబ్దాల సర్వీసు తర్వాత కూడా అదే పోస్టులో కొనసాగాల్సిన దుస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 40 వేల మంది ఎస్జీటీలు ఉద్యోగోన్నతులను పొందలేకపోతున్నారని, ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
25 ఏండ్లుగా ఒకే పోస్టులో
రాష్ట్ర విభజనకు ముందు 2000 సంవత్సరంలో ఎస్జీటీలుగా నియమితులైన వేల మంది 25 ఏండ్లుగా అదే పోస్టులో కొనసాగుతున్నారు. 2002 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు 2002 అక్టోబర్ 17న విధుల్లో చేరారు. ఈ ఏడాది అక్టోబర్ 16 నాటికి వారు 24 ఏండ్ల సర్వీసు పూర్తిచేసుకోనున్నారు. అయినప్పటికీ ఉద్యోగోన్నతులు లభించడం లేదని, వేతనాల విషయంలోనూ తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఎస్జీటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా 6, 12, 18, 24 ఏండ్ల సర్వీసు పూర్తిచేసినవారికి ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ సేల్ ప్రయోజనాలు లభిస్తాయి. కానీ, తమకు అదనపు ప్రయోజనాలు లభించడంలేదని, రెండు ఇంక్రిమెంట్లకు బదులు కేవలం ఒక్క ఇంక్రిమెంట్‌తోనే సరిపెట్టుకోవాల్సి వస్తున్నదని టీచర్లు గగ్గోలు పెడుతున్నారు.
ఏపీలో 30 ఏండ్లకూ స్కేల్
మన పొరుగు రాష్ట్రమైన ఏపీలో 30 ఏండ్ల సర్వీసుకు సైతం ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ సేల్ వర్తింపజేస్తుండటంతో అక్కడి ఉపాధ్యాయులకు ఎంతో ఊరట లభిస్తున్నది. తెలంగాణలో మాత్రం 24 ఏండ్ల సేలే గరిష్ఠ ప్రయోజనంగా ఉండటంతో దీర్ఘకాలం పనిచేసిన ఎస్జీటీలు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో మన దగ్గర కూడా 30 ఏండ్ల సర్వీసుకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ సేల్ మంజూరు చేయాలని ఎస్జీటీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు.
6, 12, 18, 24 ఏండ్లతో పాటు 30 ఏండ్ల సర్వీసుకు కూడా వేతన సేల్ కల్పించాలని కోరారు. దీంతో ఉద్యోగోన్నతులు ఆలస్యమైనా కనీసం వేతనాల రూపంలో ఊరట లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 10 వేల ఎస్జీటీ పోస్టులను ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులుగా అప్‌గ్రేడ్ చేసి ఉద్యోగోన్నతులు కల్పించాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాతికేండ్లయినా ప్రమోషన్ నిల్.. అత్యంత దయనీయ స్థితిలో ఎస్జీటీలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

