TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
TCS: గ్రీన్ కార్డు ప్రోగ్రాంపై అమెరికా సర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల తమ పని విధానంపై ఎటువంటి ప్రభావం ఉండదు అని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పేర్కొన్నది. రాబోయే అయిదేళ్లలో అమెరికాలోనే 15వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు టీసీఎస్ చెప్పింది.
న్యూఢిల్లీ: గ్రీన్ కార్డు ప్రోగ్రాంపై అమెరికా సర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల తమ పనిపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు అని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) పేర్కొన్నది. విదేశీ వర్కర్లకు గ్రీన్ కార్డులు జారీ చేసే అంశంలో.. 8 ఐటీ కంపెనీలపై అమెరికా నిషేధాన్ని విధించింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజాంట్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఆ జాబితాలో ఉన్నాయి. అమెరికన్ జాబ్ మార్కెట్లో స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదన్న ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా నిర్ణయం పట్ల టీసీఎస్ స్పందిస్తూ.. తమ వర్క్‌ఫోర్స్ స్ట్రాటజీలో కానీ, కస్టమర్ ఎంగేజ్మెంట్లో కానీ ఎటువంటి ప్రభావం ఉండబోదని పేర్కొన్నది. తాము లోకల్ హైరింగ్‌పై ఫోకస్ పెట్టనున్నట్లు టీసీఎస్ చెప్పింది.
గడిచిన రెండేళ్ల నుంచి తమ పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ దరఖాస్తుల సంఖ్య సింగిల్ డిజిట్‌లోనే ఉందని, గ్రీన్ కార్డులను సస్పెండ్ చేయడం వల్ల తమ వర్క్‌ఫోర్స్ స్ట్రాటజీలో మార్పు ఉండబోదని టీసీఎస్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. అమెరికా కార్మిక శాఖ ఇచ్చే ఆదేశాలకు అనుగుణం వ్యవహరించనున్నట్లు టీసీఎస్ తెలిపింది. గ్రీన్ కార్డుల పరిస్థితి ఎలా ఉన్నా.. తమ కంపెనీ మాత్రం అమెరికాలో సుమారు 15వేల మందిని రానున్న అయిదేళ్లలో రిక్రూట్ చేసుకోనున్నట్లు టీసీఎస్ పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

