లాస్ ఏంజిల్స్: పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్(Taylor Swift) చరిత్ర సృష్టించింది. గ్రామీ మ్యూజిక్ అవార్డుల్లో కొత్త చరిత్రను లిఖించింది. బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఆమె నాలుగోసారి కైవసం చేసుకున్నది. ఇవాళ జరిగిన గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో మిడ్నైట్స్ అన్న ఆల్బమ్‌కు ఆ అవార్డు దక్కింది. బెస్ట్ ఆల్బమ్ క్యాటగిరీలో నాలుగుసార్లు అవార్డు గెలిచిన తొలి సింగర్‌గా ఆమె నిలిచింది. అయితే మూడుసార్లు బెస్ట్ ఆల్బమ్ గెలిచిన సింగర్లలో స్టీవ్ వండర్, పౌల్ సిమన్, ఫ్రాంక్ సినత్రాలు ఉన్నారు.
సెలీన్ డియాన్ చేతుల మీదుగా టేలర్ స్విఫ్ట్ అవార్డును అందుకున్నది. మిడ్నైట్స్ ఆల్బమ్.. టేలర్ స్విఫ్ట్ రూపొందించిన పదవ ఆల్బమ్ కావడం విశేషం. ఈ ఏడాది రికార్డ్ ఆఫ్ ద ఇయర్, సాంగ్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ పాప్ సోలో పర్ఫార్మెన్స్, బెస్ట్ పాప్ డుయో, బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్ కేటగిరీల్లోనూ టేలర్ ఈసారి నామినేట్ అయ్యారు. మిడ్నైట్స్ కు బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్ అవార్డు కూడా దక్కింది.
గ్రామీ పురస్కారాల వేళ టేలర్ స్విఫ్ట్ ఓ సర్ప్రైజ్ ప్రకటన కూడా చేసింది. తన 11వ స్టూడియో ఆల్బమ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ఆమె చెప్పింది. బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్ అవార్డు అందుకున్న సమయంలో ఆమె ఈ విషయాన్ని తెలిపింది. ఏప్రిల్ 19వ తేదీన కొత్త ఆల్బమ్ రిలీజ్ అవుతోందని, ద టార్చర్డ్ పోయెట్స్ డిపార్ట్మెంట్ అన్న పేరుతో ఆ ఆల్బమ్ రిలీజ్ చేయనున్నట్లు ఆమె చెప్పారు.
🚨| Taylor Swift with boygenius and Jack Antonoff at the 2024 #GRAMMYs! pic.twitter.com/4WCBr0n6eW
— The Eras Tour (@tswifterastour) February 5, 2024