ముంబై, సెప్టెంబర్ 3 : దేశీయ మార్కెట్లో ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని టాటా మరో మాడల్‌ను తీసుకొచ్చింది. కర్వ్ విభాగంలోనే సిరీస్ ఎక్స్ మాడల్‌ను పరిచయం చేసింది. ప్రారంభ ధర రూ.9.99 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ.19 లక్షలుగా నిర్ణయించింది.
1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో తయారైన ఈ మాడల్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 2 అడాస్, ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, క్రూజ్ కంట్రోల్, స్మార్ట్ కీ, ఆరు స్పీకర్లు, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది.