Tanuja | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి అధికారికంగా ఎండ్ కార్డు పడింది. ఈ సీజన్లో కామనర్‌గా, ఆర్మీ మ్యాన్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. సీరియల్ నటి తనూజ రన్నరప్‌గా నిలిచినా, విన్నర్‌గా ఉండాల్సిన అన్ని లక్షణాలు తనూజలోనే ఉన్నాయన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో బలంగా వినిపిస్తోంది. నిజానికి, బిగ్ బాస్ 9 టైటిల్ ఫేవరెట్‌గా ఇంట్లోకి అడుగుపెట్టింది తనూజనే అని చాలా మంది ముందే ఫిక్స్ అయ్యారు. అంచనాలకు తగ్గట్టుగానే తనూజ ఎక్కడా తగ్గకుండా తన ఆటతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. టాస్కులు, నామినేషన్స్, డిబేట్స్… పరిస్థితి ఏదైనా సరే తన వాదనను ధైర్యంగా వినిపిస్తూ ముందుకెళ్లింది. దీంతో ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
అయితే భరణితో బాండింగ్, కొన్నిసార్లు అనవసరంగా అతి వాదన చేయడం వంటి అంశాలు ఆమెకు నెగటివ్‌గా మారినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో కళ్యాణ్ పడాలకు పాజిటివ్ అంశాలు కలిసొచ్చాయి. తనూజ, కళ్యాణ్ పడాల ఇద్దరూ క్లోజ్ అవ్వడం కూడా చివరికి తనూజకే నష్టంగా మారిందని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో తనూజ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్‌కు సపోర్ట్ చేసిన పరిస్థితి ఏర్పడడంతో, ఆమె ఓటింగ్‌పై ప్రభావం పడినట్టు సమాచారం. ఈ పరిణామాల మధ్య చివరికి టైటిల్ కళ్యాణ్ పడాల చేతికి వెళ్లింది. అయితే ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం తనూజ సంపాదన. రన్నరప్‌గా నిలిచినా, విన్నర్‌కు సమానంగా ఆమె సంపాదించిందని టాక్ నడుస్తోంది. సమాచారం ప్రకారం, తనూజకు వారానికి సుమారు రూ.2.8 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారట. అలా 15 వారాల పాటు బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగిన ఆమె మొత్తం రూ.42 లక్షలకు పైగా సంపాదించినట్టు తెలుస్తోంది.
ఇక విన్నర్ కళ్యాణ్ పడాల విషయానికి వస్తే, ప్రైజ్ మనీతో పాటు ఇతర బెనిఫిట్స్ కలిపి దాదాపు రూ.50 లక్షల వరకు ఆయన గెలుచుకున్నట్టు సమాచారం. అంతేకాదు, ఒక బ్రాండ్ న్యూ కారు కూడా కళ్యాణ్ సొంతమైంది. ఈ లెక్కన చూస్తే టైటిల్ దక్కకపోయినా తనూజ కూడా ఆర్థికంగా మంచి లాభమే పొందిందని చెప్పవచ్చు. మొత్తంగా బిగ్ బాస్ 9 ఇచ్చిన ఫేమ్ కళ్యాణ్ పడాల, తనూజ జీవితాలను ఎలా మలుపు తిప్పుతుందో చూడాల్సి ఉంది. ఈ షో తర్వాత వీరి కెరీర్లు ఏ దిశగా సాగుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.