సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 7: వినాయక నిమజ్జనోత్సవంలో కేసీఆర్ పాటల జోష్ కనిపించింది. సారే కావాలంటున్నరే, చల్ దేఖ్లేంగే, గులాబీల జెండలే రామక్క’ పాటలపై యువకులు నృత్యాలు చేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గణేశ్ నిమజ్జనాలు జరగ్గా, యువతీ యువకులు కేసీఆర్ పాటలపై డాన్స్లు చేశారు. సిరిసిల్లకు చెందిన ఓ దివ్యాంగుడు యువకులతో కలిసి ‘దేఖ్లేంగే’ పాటపై చేసిన నృత్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నిమజ్జనోత్సవ యాత్రలో కేసీఆర్ పాటతో వస్తున్న వారిని సిరిసిల్ల మానేరువాగు వద్ద పోలీసులు పాటను ఆపివేయడంతో వాగ్వావాదం జరిగింది. పోలీసులు అంప్లిఫైర్ను తీసుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేసీఆర్ పాట వింటేనే ప్రభుత్వం భయపడిపోతున్నదని యువకులు మండిపడ్డారు.