Tamil politics : అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (AMMK) పార్టీ అధ్యక్షుడు టీటీవీ దినకరన్ (TTV Dhinakaran) తన పార్టీ నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు వేశారు. సీఎం విజయ్ (CM Vijay) నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు పలికినందుకు దినకరన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏఎంఎంకే పార్టీ తరఫున కామరాజ్ ఒక్కడే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మన్నార్ గుడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు.
అయితే కామరాజ్ అధికార పార్టీకి ఏకపక్షంగా మద్దతు తెలిపి పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రవర్తించారన్న కారణంతో దినకరన్ ఆయనపై బహిష్కరణ వేటు వేశారు. పార్టీలోని అన్ని పదవుల నుంచి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కామరాజ్‌ను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. మన్నార్గుడిలో కామరాజ్ గెలుపు కోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలకు, నమ్మకంతో ఓటేసిన ప్రజలకు ఎమ్మెల్యే కామరాజ్ ద్రోహం చేశాడని విమర్శించారు.
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి కామరాజ్ మద్దతు ప్రకటించిన కొన్ని గంటలకే టీటీవీ దినకరన్ ఈ బహిష్కరణ ప్రకటన చేశారు. అంతకుముందు అసెంబ్లీ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ ఎన్నికను కామరాజ్ స్వాగతించారు. అంతేగాక టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు.