Tamil politics | గెలిచిన ఒక్క ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు వేసిన దినకరన్.. కారణం అదే..!
Tamil politics | అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (AMMK) పార్టీ అధ్యక్షుడు టీటీవీ దినకరన్ (TTV Dhinakaran) తన పార్టీ నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు వేశారు. సీఎం విజయ్ (CM Vijay) నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు పలికినందుకు దినకరన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏఎంఎంకే పార్టీ తరఫున కామరాజ్ ఒక్కడే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మన్నార్ గుడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు.
Tamil politics : అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (AMMK) పార్టీ అధ్యక్షుడు టీటీవీ దినకరన్ (TTV Dhinakaran) తన పార్టీ నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు వేశారు. సీఎం విజయ్ (CM Vijay) నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు పలికినందుకు దినకరన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏఎంఎంకే పార్టీ తరఫున కామరాజ్ ఒక్కడే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మన్నార్ గుడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు.
అయితే కామరాజ్ అధికార పార్టీకి ఏకపక్షంగా మద్దతు తెలిపి పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రవర్తించారన్న కారణంతో దినకరన్ ఆయనపై బహిష్కరణ వేటు వేశారు. పార్టీలోని అన్ని పదవుల నుంచి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కామరాజ్‌ను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. మన్నార్గుడిలో కామరాజ్ గెలుపు కోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలకు, నమ్మకంతో ఓటేసిన ప్రజలకు ఎమ్మెల్యే కామరాజ్ ద్రోహం చేశాడని విమర్శించారు.
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి కామరాజ్ మద్దతు ప్రకటించిన కొన్ని గంటలకే టీటీవీ దినకరన్ ఈ బహిష్కరణ ప్రకటన చేశారు. అంతకుముందు అసెంబ్లీ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ ఎన్నికను కామరాజ్ స్వాగతించారు. అంతేగాక టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
MLC Dasoju Shravan Kumar | గ్రాడ్యుయేట్స్ నడుం బిగించి ముందుకు రావాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు యువకులు మృతి
Ori Nayano | హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘ఓరి నాయనో’ చిత్రం!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

