Weather | బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. రాగల 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..!
Weather | మండుటెండలు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ కేంద్రం తీపి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోందని, ఈ అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Weather : మండుటెండలు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ కేంద్రం తీపి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోందని, ఈ అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా ఈ వారం చివరి నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్–నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని వెల్లడించింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోందని, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని చెప్పింది. దీనికితోడు తూర్పు గాలులలోని ద్రోణి ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన ప్రకారం.. సోమవారం ఉదయం నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల చక్రవాత ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇక బుధ, గురువారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుంది. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరుగనున్నాయి. మంగళవారం కూడా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తరకోస్తాంధ్రప్రదేశ్లో మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడనున్నాయి. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్‌లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 30 -40 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలులు వీయనున్నాయి. రాయలసీమలో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
స్కౌట్ అండ్ గైడ్ది నిస్వార్థ సేవ
Krithi Shetty | చూపులతోనే కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న కృతి శెట్టి!
Keerthy Suresh | చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. చూపులతోనే కుర్రాళ్లకు చెక్!
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

