చెన్నై: తమిళనాడు సీపీఎం ఎమ్మెల్యే కే మారిముత్తు హిందువుల మనోభావాలను మరోసారి దెబ్బతీశారు. రామాయణం ఓ ఊహాజనిత ఇతిహాసమని ఆయన అన్నారు. అదొక క్లాసికల్ సాహిత్యమని, తమిళ కవి కంబార్ కవితాత్మక నైపుణ్యం ఆ సాహిత్యంలో కనిపిస్తుందని తెలిపారు. సేతుసముద్రం ప్రాజెక్టును అమలు చేయాలని అసెంబ్లీలో సీఎం స్టాలిన్ తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో ఎమ్మెల్యే మారిముత్తు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పిన ఆ ఎమ్మెల్యే.. సేతుసముద్రంలో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలన్నది స్వాతంత్య్ర సమరయోధుల ఆశయమన్నారు.