Hooch Tragedy : తమిళనాడు (Tamil Nadu)లోని కళ్లకురిచి (Kallakurichi)లో నాటు సారా తాగిన (Toxic Alcohol) ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కల్తీసారా ఘటనలో శుక్రవారం నాటికి మృతి చెందిన వారి సంఖ్య 47కు చేరినట్లు తమిళనాడు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సంగుమణి తెలిపారు.
ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 మందికిపైగా బాధితులు జిల్లాలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కల్తీసారా ప్రభావంతో కొందరికి కిడ్నీలు, ఇతర అవయవాలు విఫలమవుతుండటంతో నిపుణులైన వైద్యులను అధికారులు రంగంలోకి దింపారు.
కలెక్టర్, ఎస్పీలపై వేటు : ఎంకే స్టాలిన్
కల్తీ సారా ఘటనపై తమిళనాడు అసెంబ్లీలో సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటన చేశారు. కళ్లకురుచి జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేశామని, జిల్లా ఎస్పీని సస్పెండ్ చేశామని వెల్లడించారు. సంబంధిత పోలీస్ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసిందని తెలిపారు. ఈ కేసును సీబీసీఐడీకి బదిలీ చేశామని, యువతపై దుష్ప్రభావం చూపుతున్న డ్రగ్ రక్కసిని అణిచివేసేందుకు అవసరమైన అన్ని చర్యలనూ చేపడుతున్నామని సీఎం పేర్కొన్నారు.
Read More :
Back Pain | నడకతో వెన్నునొప్పి మటుమాయం!