ఐఎస్ఎస్లో వండిన నాసా వ్యోమగాములు
వాషింగ్టన్, నవంబర్ 1: రోదసిలో మొక్కల పెంపకాన్ని చేపడుతున్న నాసా శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్ఎస్)లోని నాసా ప్లాంట్ హ్యాబిటేట్-04 (పీహెచ్-04) ప్రయోగశాలలో పండించిన తాజా మిరపకాయలతో మెక్సికన్ల సంప్రదాయ వంటకం టాకోస్ను (రొట్టె, కూరగాయలతో తయారు చేసే వంటకం) తయారు చేశారు. స్పేస్లో పండించిన మిర్చిలతో చేసిన టాకోస్ చాలా రుచిగా ఉందన్నారు. ఈ మేరకు ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో నాలుగు నెలల పాటు సాగు చేసిన ఈ మిరపకాయలను త్వరలోనే భూమి మీదకు తీసుకురానున్నారు.