Jobs | ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ (Canara Bank) 2026-27 సంవత్సరానికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 3500 ఖాళీలను భర్తీ చేయనున్నది. తెలంగాణలో 134 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తులను ఆన్లైన్లో అక్టోబర్ 17లోగా చేసుకోవాలి.
కేటగిరీవారీగా పోస్టులు
జనరల్ (UR)- 1541
ఓబీసీ- 845
ఎస్సీ- 553
ఈడబ్ల్యూఎస్- 335
ఎస్టీ- 226
వీటిలో తెలంగాణలో 134 ఖాళీలు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 247, కర్ణాటకలో 581, తమిళనాడులో 391, ఉత్తరప్రదేశ్‌లో 409, కేరళలో 240, మహారాష్ట్రలో 205, వెస్ట్ బెంగాల్లో 150, మధ్యప్రదేశ్‌లో 110 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు
గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. 2023, జనవరి 1 నుంచి 2026, సెప్టెంబర్ 9 మధ్యలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఇప్పటికే అప్రెంటిస్ పూర్తిచేసినవారు, డిగ్రీ పూర్తై సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువకాలం వేరే ఉద్యోగం చేస్తున్నవారు అనర్హులు.
వయసు
2026 , సెప్టెంబర్ 1 నాటికి 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5, దివ్యాంగులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది. వితంతువులు, విడాకులు పొందిన మహిళలు జనరల్/ఈడబ్ల్యూఎస్‌లకు 35, ఓబీసీలకు 38, ఎస్సీ, ఎస్టీలకు 40 ఏండ్ల వరకు అవకాశం కల్పించారు.

Canara Bank Posts
ఎంపిక
12వ తరగతి (HSC/10+2) లేదా డిప్లొమా మార్కుల ఆధారంగా రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానిక భాషలో పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
శిక్షణ, స్టైపెండ్
ఎంపికైనవారికి సంవత్సరం శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో నెలకు రూ. 16,650 స్టైపెండ్ ఇస్తారు.
ఫీజు
దరఖాస్తు ఫీజు రూ. 500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
దరఖాస్తు
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ముందుగా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) పోర్టల్ https://nats.education.gov.inలో రిజిస్టర్ చేసుకోవాలి. దీనిలో వచ్చిన ఎన్రోల్మెంట్ నంబర్‌తో కెనరా బ్యాంక్ అప్లికేషన్ ఫామ్‌ను నింపాలి. తరువాత కెనరా బ్యాంక్ వెబ్సైట్ www.canarabank.bank.inలోని కెరీర్స్ విభాగంలోని 2026-27 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నోటిఫికేషన్‌ను సెలెక్ట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
చివరితేదీ
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 17 వరకు దరఖాస్తు చేసుకోవాలి.

Apprentice