మెదక్ : విద్యుత్ కోతలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్రీఫేస్ కరెంటు సక్రమంగా రావడం లేదని ఆరోపిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మూసాపేట విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట రుస్తుంపేట, మూసాపేట, నాగులపల్లి తాండవాసులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయానికి కరెంటు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయానికి త్రీఫేస్ కరెంటు ఇవ్వకపోవడంతో మోటర్లు నడవడం లేదని లో వోల్టేజితో బోర్ మోటార్ కాలిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కరెంటు సక్రమంగా చేయకపోతే సబ్ స్టేషన్ ను ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు.