బీబీనగర్, అక్టోబర్ 7: యదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం సిర్పూర్కాగజ్ నగర్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు, మంటలు చెలరేగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్–కాగజ్‌నగర్ వైపు వెళ్తున్న రైలును బీబీనగర్‌లో డ్రైవర్ నిలిపివేశారు. బ్రేక్ లైనర్లు పట్టుకోవడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం.
పొగలను కో-పైలట్ గుర్తించి వెంటనే అప్రమత్తం చేయడంతో రైలును నిలిపివేసి సిబ్బంది చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.