సీనియర్ హీరోయిన్ టబు గురించి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీకి పరిచయం అయిందే తెలుగు సినిమాతో. కూలీ నెం 1 సినిమాలో వెంకటేష్ కు జోడీగా నటించింది. ఆ తర్వాత నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో జోడీ కట్టింది. తెలుగులో నటిస్తూనే తమిళం హిందీలో కూడా స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది ఈమె. ముఖ్యంగా బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. వయసు 40 దాటిన తర్వాత కూడా ఇప్పటికీ వరస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈ వయసులో టబు ఎంచుకుంటున్న పాత్రలు వివాదాస్పదంగా మారుతున్నాయి.
మరీ ముఖ్యంగా హాట్ కారెక్టర్స్ తో దుమ్ము దులిపేస్తుంది ఈ ముదురు భామ. తాజాగా ఈమె భూల్ భూలయ్య 2 సినిమాలో నటిస్తోంది. ఇందులో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. చంద్రముఖి సినిమాకి సీక్వెల్ ఇది. ఈ మధ్య హీరో కార్తీక్ కు కరోనా పాజిటివ్ రావడంతో సినిమా షూటింగ్ బ్రేక్ లు పడ్డాయి. అలాగే కియారా అద్వానీ కూడా ఇంట్లోనే ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో టబు పాత్ర ఇప్పుడు సంచలనంగా మారుతుంది. హీరోయిన్ తల్లిగా ఈమె నటిస్తోంది. అందులో పెద్ద వింతేముంది అనుకోవచ్చు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.
ఈ సినిమాలో అల్లుడు తో సంబంధం పెట్టుకునే పాత్రలో టబు నటిస్తోందని తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే అంతకన్నా సంచలనం మరొకటి ఉండదు. ఇదిలా ఉంటే ఈ మధ్య ఈ తరహా పాత్రలే ఎక్కువగా కనిపిస్తుంది టబు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా వచ్చిన అంధధూన్ రీమేక్ లో ఇలాంటి అక్రమ సంబంధం పెట్టుకునే పాత్రలోనే నటించింది టబు. ఈ మధ్య వచ్చిన ఏ సూటబుల్ బాయ్ వెబ్ సిరీస్ లో కూడా తన వయసులో సగం ఉన్న ఇషాన్ ఖట్టర్ తో బెడ్ రూమ్ సన్నివేశాలు చేసింది. వీటిపై పెద్ద దుమారమే రేగింది. ఈ వయసులో ఇలాంటి సన్నివేశాలు చేయడం ఏంటి.. ఆంటీ ఏజ్ లో ఈ నాటి పనులు ఏంటి అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.