స్టేషన్ ఘనపూర్ 09 : కేసీఆర్ చస్తేనే తెలంగాణ పట్టిన పీడ పోతుందంటూ అవమానించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై చర్యలు తీసుకోవాలంటూ స్టేషన్ ఘనపూర్ ఏసీపీ భీమ్ శర్మకు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే టి.రాజయ్య వినతి పత్రం అందించారు. అంతరం మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ.. రావణ కష్టాన్ని మరిపించే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు.
ముఖ్యమంత్రి హిట్లర్ లాగా ప్రజాస్వామాన్ని కూని చేసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడడని మండిపడ్డారు. ప్రతి పక్షాల హక్కును తన చేతిలోకి తీసుకొని అహంకారంతో ముందుకు వెళ్తున్నాడని రాజయ్య తీవ్రంగా విమర్శించారు. వీర్లపల్లి శంకరయ్య కేసీఆర్ వయసుకు విలువనివ్వకుండా సీఎంకు ప్రతిబింబంగా మాట్లాడడాన్ని, వేయి చావు డప్పులతో కేసీఆర్ చావును కోరుకోవడాన్ని ఆయన రాజయ్య తీవ్రంగా ఖండించారు.
ఒకవేళ కేసీఆర్ పిలుపిస్తే లక్ష చావు డబ్బులతో సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ముందుకు వెళ్తామని రాజయ్య స్పష్టం చేశారు. అలాగే అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బహిష్కరించడాన్ని రాజయ్య తీవ్రంగా ఖండించారు. దళితులపై మాట్లాడే నైతిక హక్కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, స్పీకర్ ప్రసాద్ కు లేదన్నారు. కడియం ఏనాడు దళితుల కోసం ఏమి చేయలేదని, ఏమీ మాట్లాడలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చల్ల రమ్యా రెడ్డి, పొన్న రాజేష్, తాడికొండ మధు, పట్టణ అధ్యక్షుడు కనకం గణేష్, మాజీ సర్పంచ్ సురేష్, శీలం శ్యామ్, కృష్ణ సాయి, కుంభం కుమార్, చిట్టిబాబు గాదె రాజు, గుండె మల్లేష్, హీరాసింగ్ ప్రసాద్, జ్యోతి రెడ్డి, పావని, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.