హైదరాబాద్ : నగర పారిశుధ్యం ( Sanitations ) కోసం నిరంతరం శ్రమిస్తున్న స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల ( Auto Tipper Workers ) సమస్యలను ప్రభుత్వానికి విన్నవించాలని యూనియన్ ప్రతినిధులు నందినగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) కు వినతి పత్రం అందజేశారు. తమ ఆందోళనలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆటో కార్మికులకు అధికారిక గుర్తింపు ఇవ్వాలని, కార్మికులకు కార్పొరేట్ గౌరవంతో పాటు ప్రతి కార్మికునికి జీవిత బీమా, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో మహిళా కార్మికులకు కనీస వసతులు, వాష్‌రూమ్స్, టాయిలెట్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యార్డు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇంటి చెత్త సేకరణ జీవో, బల్క్ గార్బేజ్ జీవోలను వెంటనే రద్దు చేయాలని కోరారు. కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని కోరారు.