Yuvraj Singh : భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. వీడ్కోలు అనంతరం యువ బ్యాటర్లకు కోచింగ్ ఇస్తున్న యువీ.. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) బ్యాటింగ్ కోచ్ పదవి చేపట్టనున్నాడు. ఐపీఎల్లో ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని ఢిల్లీని విజేతగా నిలిపేందుకు కృషి చేయనున్నాడు. ఐపీఎల్ 20వ సీజన్లో యూవీని తమ బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమవుతోందని సమాచారం.
ఐపీఎల్లో ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని ఢిల్లీ క్యాపిటల్స్ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను కోచ్‌గా నియమించనుంది. అంతర్జాతీయ క్రికెట్లో విజయవంతమైన యూవీకి యువకులకు బ్యాటింగ్ మెకలువలు నేర్పే బాధ్యతను అప్పగించనుంది ఢిల్లీ. ఐపీఎల్ సీజన్ 2027కు ముందే ఢిల్లీ క్యాపిటల్స్ తమ కోచింగ్ సిబ్బందిని మార్చనుంది. 2027-28 సీజన్ కోసం ప్రస్తుతం కోచింగ్ యూనిట్లో భాగమైన వేణుగోపాల్ రావు, హేమంగ్ బదొని, మునాఫ్ పటేల్ స్థానాల్లో కొత్త వాళ్లను తీసుకోవాలని ఢిల్లీ భావిస్తోంది అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
Former India all-rounder Yuvraj Singh to become batting coach of IPL franchise Delhi Capitals: League sources. pic.twitter.com/NmQELY8u0w
— Press Trust of India (@PTI_News) June 19, 2026
ప్రస్తుతం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఓపెనర్ అభిషేక్ శర్మలను సానబెట్టిన యువరాజ్ ఇకపై ఢిల్లీ బ్యాటింగ్ యూనిట్‌ను చక్కదిద్దనున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సైతం ఢిల్లీ ఫ్రాంచైజీతో కొనసాగనున్నాడు. ఢిల్లీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సేవలందిచనున్నాడు.
టీమిండియా ఆల్‌రౌండర్‌గా హిట్ కొట్టిన యువరాజ్ సింగ్ ఐపీఎల్లో 132 మ్యాచ్‌లు ఆడాడు. 2109లో ముంబై ఇండియన్స్ తరఫున చివరి మ్యాచ్ ఆడిన యూవీ.. రిటైర్మెంట్ అనంతరం అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ వంటి ఆటగాళ్లకు కోచింగ్ ఇస్తున్నాడు.