HomeNewsSuspicion And Inferiority Complex A Threat To Relationship
మీ భాగస్వామిలో ఈ లక్షణాలు కనిపిస్తే ఆ బంధం సమస్యల్లో ఉన్నట్టే..
నమ్మకం, ప్రేమ బంధాన్ని బలోపేతం చేస్తే.. అనుమానం, అభద్రత దాన్ని బలహీనపరుస్తాయి. మీ భాగస్వామిలో కింది లక్షణాలు కనిపిస్తే ఆ బంధం సమస్యల్లో ఉన్నట్టే లెక్క.
నమ్మకం, ప్రేమ బంధాన్ని బలోపేతం చేస్తే.. అనుమానం, అభద్రత దాన్ని బలహీనపరుస్తాయి. మీ భాగస్వామిలో కింది లక్షణాలు కనిపిస్తే ఆ బంధం సమస్యల్లో ఉన్నట్టే లెక్క.
ఏ బంధంలో అయినా సామాజిక స్వేచ్ఛ అవసరం. కానీ మీ భాగస్వామి ఏ సాంఘిక బంధాలూ పెట్టుకోకుండా, మిమ్మల్ని కూడా జనంలో తిరగనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటే అభద్రతలో ఉన్నట్టు.
కొందరికి ఆత్మన్యూనత ఎక్కువ. జీవిత భాగ స్వామిని ఎక్కడ కోల్పోతామో అన్న భయం.. వాళ్లలో అభద్రతకు కారణం అవుతుంది.
ఏ చిన్న వాదన జరిగినా మిమ్మల్నే దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే.. ఆ బంధంలో సమస్య ఉన్నట్టే భావించాలి.
అభద్రతలో మునిగితేలే వాళ్లు చిన్న విమర్శను కూడా తట్టుకోలేరు. సద్విమర్శ అయినా సరే, గొడవకు
సిద్ధపడతారు.
మీరు ప్రేమిస్తున్నారనే విషయాన్ని పదే పదే నిరూపించుకోవాల్సి వస్తున్నదంటే మీ బంధంలో అభద్రత రాజ్యమేలుతున్నట్టే.
ప్రతిదానికీ అతిగా ఆలోచించడం, లేనిపోనివి ఊహించుకోవడం కూడా అభద్రతకు చిహ్నాలే.