మంథని టౌన్, మార్చి 28: గంజాయి స్మగ్లింగ్ చేస్తూ మహారాష్ట్ర పోలీసులకు పట్టుబడ్డ పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాచీడి శ్రీనివాస్‌గౌడ్‌ను సస్పెండ్ చేస్తూ పెద్దపల్లి డీఈవో మాధవి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంథని మండలం బెస్తపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు మరో యువకుడు మూడు రోజులక్రితం కారులో గంజాయి తరలిస్తూ మహారాష్ట్ర పోలీసులకు చిక్కారు. మంథని ఎంఈవో నివేదిక మేరకు శ్రీనివాస్‌గౌడ్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్టు డీఈవో మాధవి తెలిపారు.