హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్లలో ఏఆర్టీ, సరోగసి చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సచివాలయంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సెంటర్ల పనితీరు, ఏఆర్టీ, సరోగసీ చట్టాల అమలు, పీసీపీఎన్డీటీ యాక్ట్ అమలుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫర్టిలిటీ సేవల పేరుతో పేషెంట్లపై అనవసర ఆర్థిక భారం మోపకుండా, పారదర్శకతతో సేవలు అందేలా చూడాలని సూచించారు. ప్రైవేట్ రంగంలో పర్యవేక్షణను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు.