న్యూఢిల్లీ : వక్ఫ్ (సవరణ) చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం విచారించనుంది. ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్‌తో పాటు ఆప్, డీఎంకే తదితరులు దాఖలు చేసిన 10 పిటిషన్లను బుధవారం విచారించనుంది. ఒక పక్క విపక్ష పార్టీలు వక్ఫ్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో కేసులు వేయగా, దానికి కౌంటర్‌గా వక్ఫ్ బిల్లుకు మద్దతుగా 6 బీజేపీ పాలిత రాష్ర్టాలు (మధ్యప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్) సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.