Pegasus : ‘పెగాసస్’పై ఈ నెల 5న సుప్రీంకోర్టు విచారణ!
సుప్రీంకోర్టు విచారణ | ‘పెగాసస్’ వ్యవహారంపై ఈ నెల 5న సుప్రీం కోర్టు విచారించనున్నారు. రాజకీయ నేతలు, జర్నలిస్టులతో పాటు అనేక మంది ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న ఆరోపణలపై

న్యూఢిల్లీ : ‘పెగాసస్’ వ్యవహారంపై ఈ నెల 5న సుప్రీం కోర్టు విచారించనుంది. రాజకీయ నేతలు, జర్నలిస్టులతో పాటు అనేక మంది ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్, శశి కుమార్ మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్‌ను విచారించనుంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.
కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ వ్యాజ్యం దాఖలు చేశారు. మరోవైపు, సిట్ విచారణ జరిపించాలని న్యాయవాది ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ‘పెగాసస్ స్పైవేర్’పై ప్రతిపక్షాలు కేంద ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ విషయమై కొద్ది రోజులుగా పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి. దీంతో సమావేశాలు సజావుగా సాగడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
నైట్ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడ? ఎప్పటి వరకంటే?
Nagarjuna sagar Dam । నేడు సాగర్ గేట్ల ఎత్తివేత
Covid-19 : దేశంలో కొనసాగుతున్న మహమ్మారి ఉధృతి
Sputnik V : సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి : ఆర్డీఐఎఫ్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

