Caste certificate case : నవనీత్ కౌర్‌కు ఊరట.. బొంబాయి హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే
నవనీత్ కౌర్‌కు ఊరట.. బొంబాయి హైకోర్టు ఉత్తర్వులపై స్టే | మహారాష్ట్ర అమరావతి ఎంపీ, నటి నవనీత్ కౌర్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కుల ధ్రువీకరణపత్రం రద్దు చేస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.

న్యూఢిల్లీ : మహారాష్ట్ర అమరావతి ఎంపీ, నటి నవనీత్ కౌర్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కుల ధ్రువీకరణపత్రం రద్దు చేస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ధర్మాసనం నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ.. కేసు తదుపరివిచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.
కుల ధ్రువీకరణ పత్రం రద్దు విషయంలో బొంబాయి హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నవనీత్ కౌర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. నవనీత్ కౌర్ కుల ధృవీకరణ పత్రాన్ని నకిలీదిగా హైకోర్టు ప్రకటించింది. దీంతో పాటు రూ.2లక్షల జరిమానా విధించింది. అన్ని ధ్రువపత్రాలను ఆరువారాల్లోగా సమర్పించాలని ఎంపీని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులతో నవనీత్ కౌర్ పార్లమెంట్ సభ్యత్వం ప్రమాదంలో పడింది.
తప్పుడు ధ్రువీకరణపత్రంతో ఎన్నికల్లో పోటీ చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. ఎస్సీ రిజర్వుడ్ అమరావతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నవనీత్ కౌర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. శివసేన అభ్యర్థి ఆనందరావు అడుల్స్‌పై విజయం సాధించారు. ఈ క్రమంలో ఆనందరావు నవనీత్ షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి కాదంటూ బొంబాయి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు విచారణ జరిపిన న్యాయస్థానం కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసింది.
నవనీత్ తల్లిదండ్రులు పంజాబ్‌కు చెందినవారు. నవనీత్ 2014లో రాజకీయాల్లోకి రాగా.. ఆమె శివసేన టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయింది. 2019లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందింది. ఇంతకు ముందు, శివసేన నాయకుడు జైలులో పెడతామని బెదిరించారని నవనీత్ కౌర్ ఆరోపించారు. ఈ విషయంలో ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రికి సైతం లేఖ రాశారు.
ఇవి కూడా చదవండి..
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
జూలై 11న ఆషాడ బోనాలు ప్రారంభం
జగిత్యాల యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం
నేడు 2.09లక్షల మంది ఖాతాల్లోకి ‘రైతుబంధు’
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేసిన టీటీడీ
కొవాగ్జిన్ మూడో విడత ట్రయల్స్‌పై నేడు నిపుణుల కమిటీ సమీక్ష
పులులకూ కరోనా పరీక్షలు.. ఎక్కడంటే?
క్యాన్సర్‌తో మానసిక క్షోభ : నందమూరి బాలకృష్ణ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

