సూపర్‌గర్ల్ కథాంశంతో గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందిస్తున్న ‘ఇంద్రాణి’ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. యానియా భరద్వాజ్, కబీర్‌సింగ్, ప్రణీత జిజిన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా స్టీఫెన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు నరేష్ క్లాప్‌నివ్వగా, నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘సూపర్‌గర్ల్ ఇంద్రాణి చేసే విన్యాసాలు అబ్బురపరుస్తాయి. గ్రాఫిక్స్ ప్రధానంగా ఉన్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించబోతున్నాం. యానియా భరద్వాజ్ ఇంద్రాణి పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమా కోసం ఆమె మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ తీసుకుంది’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: చరణ్ మాధవనేని, సంగీతం: సాయికార్తీక్, ఎడిటర్: చోటా కె ప్రసాద్, ఆర్ట్: రవికుమార్ గుర్రం, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: స్టాన్లీ సుమన్‌బాబు, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: స్టీఫెన్.