e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News ఐడీఎఫ్‌సీ కస్టమర్లకు సూపర్ ఆఫర్…

ఐడీఎఫ్‌సీ కస్టమర్లకు సూపర్ ఆఫర్…

ముంబై, జూన్ 28: ఐడీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా తమ కస్టమర్స్ కు డెబిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్ అందిస్తున్నది. ఈ ఆఫర్ జూన్30వరకు అందుబాటులో ఉంటుంది. డెబిట్ కార్డు ద్వారా జరిపే అన్ని రకాల కొనుగోళ్లపై 10శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చని ఐడీఎఫ్‌సీ బ్యాంక్ వెల్లడించింది. క్యాష్‌బ్యాక్ ఆఫర్ కింద గరిష్టంగా రూ.1000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ అన్ని ట్రాన్సాక్షన్లకు వర్తించదు.

కొన్ని పరిమితులు కూడా ఉన్నాయని ఐడీఎఫ్‌సీ తెలిపింది. ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసిన లేదా ఈ-వాలెట్ మనీ ట్రాన్స్‌ఫర్ కానీ ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి వాటిపై ఈ ఆఫర్ వర్తించదని ఐడీఎఫ్‌సీ పేర్కొన్నది. ఐడీఎఫ్‌సీ బ్యాంక్ వీసా డెబిట్ కార్డు వాడే వారికే 10 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ముగిసిన నెల రోజుల తర్వాత క్యాష్‌బ్యాక్ డబ్బులు ఆయా ఖాతాలో జమ అవుతాయి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana