శెల్పిడిసిపెట్టుడు = ఎవ్వరినీ లెక్కచేయకపోవడం (వాడు ఆగనే ఆగల అందర్నీ శెల్పిడిసిపెట్టిండు)బకారిచ్చుడు = చాలా తక్కువ చేసి చెప్పడం (చిన్న కాక నన్ను నలుగురిలో బకారిచ్చిండు)
మెత్తు = గుమ్మికి పేడ, గడ్డితో వేసే సీలు/మాటు
బరాలు = జిలెటిన్ స్టిక్స్ (బాంబులు). బావులు, కాలువలు తవ్వేటపుడు అడ్డమొచ్చే గుండ్లు, బండలను బరాలతో పేల్చి పగలగొడ్తరు. గుట్టల మీద క్రషింగ్ చేసేటప్పుడు కూడా వాడతారు.
ఉద్దెర గప్పాలు = ఏ పని చేయకున్నా, తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం. (వాడు చేసేపని తక్కువ ఉద్దెర గప్పాలెక్కువ)